Jagan:జగన్ ‘ మేనిఫెస్టో’.. నవరత్నాలకు మించి?

52
- Advertisement -

ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల హవా మొదలౌతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. సీట్ల కేటాయింపు మొదలుకొని, మేనిఫెస్టో వరకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. అధికార వైసీపీలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ముమ్మర కసరత్తులు జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ జనసేన పార్టీలు కూడా సీట్ల కేటాయింపుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టో, పవన్ షణ్ముఖ వ్యూహం పేరుతో కొన్ని హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

అతి త్వరలోనే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక జగన్ విషయానికొస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనుక ఆయన మేనిఫెస్టోలో చేర్చిన నవరత్నాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలకు జగన్ ఎలాంటి మేనిఫెస్టోతో బరిలోకి దిగుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ ల మార్పు చేస్తూ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఇక వచ్చే నెలలో అందరికంటే ముందుగానే వైసీపీ పూర్తి మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారట. ఈసారి నవరత్నాలకు మించి అనేలా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతున్నట్లు టాక్. గత ఎన్నికల నేపథ్యంలో సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉండగా… ఈసారి అభివృద్ది సంక్షేమం సమపాళ్ళలో ఉండే విధంగా జగన్ మేనిఫెస్టో రూపొందిస్తున్నారట. మరి జగన్ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ప్రకటిస్తారో చూడాలి.

Also Read:బొప్పాయి గింజలతో.. ఇంత ప్రమాదమా!

- Advertisement -