Jagan:జగన్ మళ్ళీ జైలుకే.. పాత కేసు రీస్టార్ట్?

13
- Advertisement -

ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. జగన్ అక్రమస్తుల పై దర్యాప్తు పునః ప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఈ కేసు అడపా దడపా చర్చకు తావిస్తోంది. ఈ కేసులో భాగంగా బెయిల్ పై ఉన్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో రఘురామ కోరారు. అయితే ఆ కేసుపై తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది దర్మాసనం. ఒక రాష్ట్రానికి సంబంధించిన సి‌ఎం కేసు విషయంలో ఆలస్యం తగదని, ఎందుకు ఆలస్యం అవుతుందో అందుకు సంబంధించిన కారణాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. .

దీంతో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు తావిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ముందు అక్రమస్తుల కేసులో జగన్ జైలు కు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన.. 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సి‌ఎం అయిన తరువాత ఈ కేసు మరుగున పడుతూ వచ్చింది. అయితే ఈ కేసు విషయంలో జాప్యం జరుగుతోందని, నిందితుడిగా ఉన్న జగన్ బయట ఉండడం వల్ల మరిన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని గత ఏడాది రఘురామ వేసిన పిటిషన్ తో మరోసారి తెరపైకి వచ్చింది.

ఆ తర్వాత దర్మాసనం పలుమార్లు ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ కేసులో సీబీఐ కి సుప్రీం కోర్టు చురకలు అంటించడంతో ఎన్నికల ముందు ఈ కేసు విచారణ వేగవంతం అయిన ఆశ్చర్యం లేదనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి అక్రమస్తుల కేసు మళ్ళీ రీ ఓపెన్ అయితే పార్టీకి, ఆయనకు భారీ నష్టం తప్పదనేది కొందరి అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:IPL 2024 :ముంబై బోణి కొట్టేనా?

- Advertisement -