మీడియా హౌస్ మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జగదీష్.. ఫోన్ ట్యాపింగ్ మీద ఇష్టం వచ్చినట్లు మీమ్స్ పెడుతున్నారు.. ఎవడు ఇచ్చాడు వాడికి సమాచారం చెప్పాలన్నారు. ఒక్క ఆడపిల్ల అయినా చెప్పిందా నా ఫోన్ ట్యాప్ చేశారు అని.. ఏ బలుపుతో పెడుతారు అలా? చెప్పాలన్నారు.
రాజకీయ పార్టీలుగా మేము మేము విమర్శలు చేసుకుంటాము.. మీకు ఎవడు ఇచ్చాడు అధికారం, సంవత్సరం నుండి కాళేశ్వరం, కాళేశ్వరం అన్నారు.. ఏమైంది కాళేశ్వరానికి, ఒక్క పిల్లర్ కుంగింది..లేనివాటిని మీరు ఊహించి రాస్తే ఒప్పుకునేది లేదు అన్నారు. నిన్న, ఇవాళ కూడా మళ్లీ రోత రాతలు మొదలు పెట్టారు..
లోపల ఏదో విచారణ జరుగుతుంటే.. మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే ఊరుకోము, ఏ పోలీస్ అధికారి చెప్పాడు మీకు అని మండిపడ్డారు.
ఈ మొగోల్ల మొహాలకి బయట మాట్లాడితేనే వినబుద్ది కాదు.. వీళ్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎవరైనా వింటారా , మహా టీవీ మీద దాడి జరిగిందని ఖండించిన నీతుల నాయుడు, డెక్కన్ క్రానికల్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయాడు చెప్పాలన్నారు. మా పిల్లల నిరసన పూర్తి కాకముందే నీతుల నాయుడుకు ఎలా తెలిసింది.. ఎలా అంటే మహా న్యూస్ కూడా నీతుల నాయుడుదేనన్నారు. చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసిన బీజేపీ వాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు.. అందరి బాగోతాలు తెలుసు అన్నారు. మేము ఏం దాడి చేయలేదు.. మా పిల్లలు వాళ్ల పద్ధతిలో నిరసన తెలిపి వచ్చారు..ప్రెస్ కౌన్సిల్ పోతా అంటే వెళ్ళమను.. ప్రెస్ కౌన్సిల్ కాకపోతే బిన్ లాడెన్ దగ్గరికి పొమ్మను, లేదా ఐఎస్ఐ తీవ్రవాదులకు చెప్పుకోమను అని ఎద్దేవా చేశారు.
Also Read;టీజీబీజేపీ చీఫ్‌పై రాజాసింగ్

