స్పీకర్ ఏకపక్ష నిర్ణయం:జగదీష్ రెడ్డి

3
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయ బద్దంగా ప్రవర్తించడం లేదు అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయం పై స్పందించిన జగదీష్ రెడ్డి… బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా.. స్పీకర్ గారికి కనపడకపోవడం విచారకరం, చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు.

స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారు… కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడటం లేదా , ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతున్నారు.. అది స్పీకర్ కి కనపడలేదు అంటా అని ఎద్దేవా చేశారు.

స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్ట పరంగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారు .. స్పీకర్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమే… స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదు.. వాళ్లను డిస్పస్ చేయడం ఖాయం అన్నారు.

Also Read:వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌, కోహ్లీ?

- Advertisement -