అబద్దాలను నమ్మి మోసపోయాం:జగదీష్ రెడ్డి

17
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్దపు హామీలను నమ్మి మోసపోయామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.పెద్ద కొడుకు రెండిచ్చిండు , చిన్నోడు నాలుగిస్తా అంటుండు అని నమ్మి ఓటేసి మోసపోయినం అని ఊర్లలో పెద్ద మనుషులు ,కేసీఆర్ పదిచ్చిండు , రేవంత్ పదిహేను ఇస్తా అంటే నమ్మి ఓటేసి మోసపోయినం అని రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు.

మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన జగదీష్ రెడ్డి… రైతు బంధు పై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతు బంధు ని వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేసిన రేవంత్..రైతుల విషయంలో రాజీ లేదు ఓట్ల రాజకీయం మాకు అవసరంలేదు అన్నారు. ఎన్నికల కమీషన్ కి రాయండి మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పారు..యాసంగి సాయం అందకముందే ఖరీఫ్ సీజన్ మొదలైంది..ఖరీఫ్ రైతు భరోసా పై రేవంత్ ప్రమాణం, ప్రకటన చేయాలన్నారు. ఇచ్చే ఉద్దేశంలేక కుంటి సాకులు చెబుతున్నారన్నారు.

ఎన్నికల కమీషన్ దృష్టిలో పడాలనే రేవంత్ వ్యాఖ్యలు చేశారన్నారు. రేవంత్ ఇచ్చినట్టు ఈసీ ఆపినట్టుంది వ్యవహారం ఉందని…రైతు బంధు ను ఎప్పుడు తాము ఆపమనలేదు అన్నారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు ఇక కొనసాగేలా కనిపించడంలేదని…రైతులకు ఇదే చివరి రైతు బంధు లా కనపడుతుంది..కేసీఆర్ కి మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుందన్నారు.

Also Read:లబ్దిదారులే స్టార్ క్యాంపెయినర్లు!

- Advertisement -