ప్రజల పక్షానే పోరాటం చేస్తాం:జగదీష్ రెడ్డి

23
- Advertisement -

నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే తెలంగాణను కుప్పకూల్చారని మండి పడ్డారు. ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని వెల్లడించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. ప్రజలు పాధి కోసం మళ్లీ విదేశాల బాట పట్టాల్సి వచ్చిందన్నారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజల గోసకు కారణమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ సర్కార్‌లో పచ్చని పంటలతో కలకలలాడే భూములు బీడుగా మారాయని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ తమ జీవితంలో నిజాలు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:గులాబీ జెండాకు 24 ఏళ్ళు…!

- Advertisement -