Jagadish Reddy:కేసీఆర్ జోలికి వస్తే తరిమేస్తాం

17
- Advertisement -

కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కలిసి నల్లగొండ జిల్లా అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ప్రజల కోసం ఎన్నిసార్లైన జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి… వైఎస్‌ ఇచ్చిన భిక్షతో బతికినోళ్లు.. కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ జోలికి వస్తే తరిమేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని ఫైర్‌ అయ్యారు. తన చరిత్ర ఏమిటో, కోమటిరెడ్డి బ్రదర్స్‌ చరిత్ర ఏంటో చర్చ పెడదామా అంటూ సవాల్‌ విసిరారు. నల్లగొండ జిల్లాకు పట్టిన శని కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, కమలం పార్టీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని చెప్పారు.

తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని …వారిద్దరికి బ్రోకర్లు అని పేరుందన్నారు. సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

Also Read:వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..

- Advertisement -