Jagadish Reddy:రైతు భరోసా బందే?

9
- Advertisement -

రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు బంధును బంద్ చేయించేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఒకవేళ రైతు భరోసా ప్రారంభిస్తే మరి సబ్ కమిటి ఎందుకని నిలదీశారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన..చిల్లర రాజకీయాలు బంద్ చేసి పాలనపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.

రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని…తెలంగాణలో శాంతి భద్రతలు లేకుండాపోతున్నాయని విమర్శించారు. మార్నింగ్ వాక్ చేస్తే చైన్ స్నాచర్లు, సాయంత్రం వేళ మహిళలపై వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనగోళ్లలో కేసీఆర్‌ను విచారణకు పిలిచినట్లే, అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ ను విచారించాలని అన్నారు.

Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

- Advertisement -