- Advertisement -
కాంగ్రెస్ రహిత తెలంగాణ ఉద్యమం నల్గొండ నుండే మొదలు పెడతామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో నల్గొండ జిల్లా నుండే తిరుగుబాటు వచ్చింది అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వ్యక్తుల అరాచకాల వల్లే తిరుగుబాట్లు వచ్చాయి.. ఇలాంటి చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవు అన్నారు.
రైతు భరోసా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసింది… కృష్ణ, గోదావరిలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా శాంతియుతంగానే ప్రజలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు…ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మాత్రం అధిగమించలేదని తేల్చిచెప్పారు.
Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్
- Advertisement -