పత్తి, వరి దాన్యం కొనుగోలు పైన ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..నిన్న ముఖ్యమంత్రి డ్రామాలాడుతూ మీటింగ్ పెట్టి ఎక్కువ ధరకు కొనమన్ని చెప్పిన అని అంటున్నాడు అన్నారు. దళారాలుకు, మిల్లర్లకు స్వేచ్ఛగా వదిలేశారు…రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంత మంది మంత్రులు చేతులు కలిపారు అన్నారు.
నల్గొండ మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూల్ చేసింది లెక్కా ఉందని…రైతు బంధు ఇవ్వకపోయినా రైతుల అప్పు చేసి పంట వేసుకుంటే అన్నారు. ఆ పంటను దళరాలు పాలు చేశారు…వందల కోట్ల చేతులు మారాయి అన్నారు. రాష్ట్రంలో 2014 ముందు నాటి పరిస్థితిలో వస్తున్నాయ్…వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలన్నారు.
సన్న బియ్యనికి బోనస్ అన్నారు, వాస్తవానికి ఎన్నికలలుకు ముందు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఒక్క గింజ కొనుగోలు చేయలేదు అన్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఎన్ని వడ్లు కొన్నారు, బోనస్ ఇచ్చారా లేదా అని ఒక్కరు చెప్తాలేరు…గత 11 నెలలు ఒక్క పని చేయలేదు అన్నారు.కేసీఆర్ ఏనాడైన నిన్ను కానీ, మీ రాహుల్ గాంధీని ఒక్క మాట అన్నారా,మరి రోజు కేసీఆర్ ని ఎందుకు తిడుతున్నావు రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో అత్యధికంగా కేసీఆర్ ని తలుచుకుంటున్నద్ధి నువ్వే అన్నారు.
ఎందుకు భయ పడుతున్నావు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని చూసి నిన్న కొడంగల్ లో అధికారులు పైన జరిగిన దాడి అధికారులు పైన జరిగినట్టు కాదు రేవంత్ రెడ్డి పైన జరిగిన దాడిగా భావించాలన్నారు. కొడంగల్ జిల్లాలో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడదల చేయాలి…వారి పైన కేసు లు పెడితే ఊరుకోనేది లేదు అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి కొడంగల్ పోయి రా ప్రజాపాలన అంటే ఏంటో తెలుస్తుంది…పోలీస్ శాఖతో అణిచివెయచ్చు అనుకుంటున్నావు అని మండిపడ్డారు.
9నెలలు గర్భిణీ, స్కూల్ వెళ్లే పిల్లలు మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్ట్ లో అన్న దుర్మార్గులు, కొడంగల్ జరిగిన దాడి బి ఆర్ ఎస్ పార్టీ..25సార్లు ఢిల్లీ పోయి కాళ్ళు మొక్కి వచ్చిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ వెళ్లారు…మీ ముఖ్యమంత్రి ఢిల్లీ కి కాళ్ళు మొక్కడానికి పోతున్నారా అన్నారు. ఒక్క ఏడాదిలోనే 25సార్లు ఢిల్లీ పోయాను ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…మోడీ కాళ్ళు పట్టుకోవడానికి పోతున్నారు అన్నారు. బిజెపి బండారాన్ని కూడ బయట పెట్టడానికి వెళ్లుతున్నాము…ఇక్కడ ఖర్చ పెట్టడానికి డబ్బులు లేవు గాని, ఢిల్లీకి పోయతందుకు డబ్బులు ఉంటాయి, మహారాష్ట్ర ఎన్నికలకు 300 కోట్ల ఖర్చు పెట్టడానికి ఉన్నాయి డబ్బులు అన్నారు.కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెళ్లి అక్కడ ఎందుకు మాట్లాడటలేరు..కాంగ్రెస్, బిజెపి ఇద్దరు తోడు దొంగలే అన్నారు. తెలంగాణ ప్రజలకు అర్ధమైంది…పరిపాలనా చేతాగక కెసిఆర్ ని బూతులు తిట్టాలి ఇదే పని రేవంత్ రెడ్డికి…ఒళ్ళు దగ్గరు పెట్టుకొని మాట్లాడకపోతే కొడంగల్ ప్రజలు చెప్పిన బుద్దే రాష్ట్ర ప్రజలంతా చెప్పుతారు అన్నారు.
Also Read:Pawan:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్