విచారణ పేరుతో లీకులెందుకు:జగదీష్ రెడ్డి

13
- Advertisement -

విద్యుత్ కొనుగోళ్ళు , కాళేశ్వరం ప్రోజెక్టుల విచారణ పై స్పందించారు మాజీమంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనా హామీల అమలు మరచి గత ప్రభుత్వాల పై నిందలు వేస్తూ పబ్బం గడుపుతోంది కాంగ్రెస్. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు…విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయి ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసాక హామీల అమలు పై ప్రజలు నిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల డ్రామాలు..కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్ని వరుసగా తెలిపోతున్నాయన్నారు. కాళేశ్వరం లో నీళ్ళు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారు…నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ లోపాలంటూ ఆరోపణలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ప్రజలు గమనిస్తున్నారు…నీళ్ళు , విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రజలు మంచినీళ్ళ కోసం రోడ్లెక్కే పరిస్థితి కనిపిస్తోంది…పదేళ్ళ క్రితం ఉన్న దుస్థితి మళ్ళీ దాపురించాయన్నారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దలు పాత్ర ఉంది…పత్తి విత్తనాల బ్లాక్ దందా పై ఓ మంత్రి పాత్ర ఉందన్నారు. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తాం…ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఇచ్చిన హామీల పై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ తపోయించుకునే ప్రయత్నం చేస్తోందని..మీడియాకు లీకులిచ్చి చెత్త , రోత రాతలు రాపిస్తున్నారన్నారు. ఎన్ని కమీషన్లు వేసినా అభ్యంతరం లేదు…కమీషన్ల విచారణ కంటే మీడియా లీకులు ఎక్కువైయ్యాయి..కమీషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీ పై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు.

Also Read:చర్మ సమస్యలకు వీటితో చెక్..

- Advertisement -