చంద్రబాబు చేతుల్లోని సాగర్ ప్రాజెక్టు!

3
- Advertisement -

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది అని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…కేసీఆర్ సీఎం ఉన్నన్ని రోజులు సీ ఆర్ పి ఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు …కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను కే ఆర్ ఎం బి కి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ వితండ వాదం చేసిందన్నారు.

లక్ష మంది తో కేసీఆర్ సభ పెట్టేసే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి కృష్ణా ప్రాజెక్టులను కే ఆర్ ఎం బి కి అప్పగించమని అసెంబ్లీ లో తీర్మానం చేసింది ..అసెంబ్లీ లో తీర్మానం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారలేదు ..తెలంగాణ నిధులు ఢిల్లీ కి తెలంగాణ నీళ్లు ఆంధ్రకు అన్నట్టు పరిస్థితి తయారైంది …చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదు ..వయా చంద్రబాబు ఈ ప్రభుత్వం మోడీ కి దగ్గరైంది ..సీ ఆర్ పి ఎఫ్ కు సాగర్ ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమేనన్నారు.

సాగు నీటి మంత్రి ఉత్తమ్ కు సోయి లేదు ..దోచుకుందాం దాచుకుందాం అనే పని లో సీఎం మంత్రులు బిజీ గా ఉన్నారు …రాష్ట్రం లో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోంది …నీళ్ల పై ముఖ్యమంత్రికి శ్రద్దలేదు .ఢిల్లీకి మూటలు పంపడం పైనే సీఎం 24 గంటలు బిజీగా ఉన్నారు …మళ్ళీ సమైక్య పాలన రోజులు వస్తున్నాయి…పరిస్థితులు ఇలానే ఉంటె హైదరాబాద్ కు తాగు నీళ్లు కూడా రావు ..కేసీఆర్ పాలన లో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం ..ఇపుడు తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితి…ఉత్తమ్ సాగు నీళ్ల మంత్రి కాదు కన్నీళ్ల మంత్రి అయ్యారు …ఉత్తమ్ నియోజవర్గం లోనే రైతులు సాగునీళ్ళు రాక కంటతడి పెడుతున్నారు …బడే భాయ్ తో బాగుండి చోటే భాయ్ ఏమి సాధించారు ? అన్నారు.

ఏ ఐ ని నమ్ముకోవడం కంటే ఎనుముల ఇంటలిజెన్స్ ను వాడుకుంటే రేవంత్ కు మంచిది …ఏ ఐ వీడియో ల పేరు తో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ సీ యూ వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోంది …కేసులకు భయపడే పార్టీ బీ ఆర్ ఎస్ ది కాదు …కోర్టులంటే ఈ సీఎం కు లెక్కలేదు …బీ ఆర్ ఎస్ కార్యకర్తలపై ఇక్కడి పోలీసులతో కాకుంటే సీఐఏ ,ముసాద్ సంస్థలతో విచారణ జరిపించుకున్నా అభ్యంతరం లేదు …మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పదవికి ముప్పు అని రేవంత్ రెడ్డే దాన్ని ఆపుతున్నారు …ఎలాగూ కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రం అధికారం లోకి వచ్చేది లేదు అని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ..విద్యా శాఖను సమర్ధంగా నిర్వహించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి ..సోయి లేక పాలన చేతగాక గురుకులాల్లో విద్యార్థుల మరణాలకు రేవంత్ కారణమవుతున్నారు అని దుయ్యబట్టారు.

Also Read:తెలంగాణ నీళ్లు ఆంధ్రాకా?: జగదీష్ రెడ్డి

- Advertisement -