సస్పెన్షన్ కుట్ర పూరితం..అక్రమం: జగదీష్ రెడ్డి

3
- Advertisement -

ఈ సస్పెన్షన్ అనేది అక్రమైనది… కుట్రపూరితంగా చేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇది ముందే నిర్ణయం తీసుకున్న సస్పెన్షన్… బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కేందుకు ముందే నిర్ణయం తీసుకున్నారు అన్నారు. ఏక వచనం అంటున్నారు నేను ఎక్కడ కూడా నీ అనలేదు..మీరు అని మాత్రమే అన్నాడు.. సభలో మాట్లాడిన్నప్పుడు వాళ్లకు మాత్రమే సమయం ఇస్తారు.మాకు ఇవ్వడం లేదు అన్నారు.

గవర్నర్ ప్రసంగం గురించి ఒక్క కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడలేదు.కానీ మా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు కూడా సభ తప్పుదోవ పట్టించలేదు, నేను లేచి గవర్నర్ ప్రసంగం పై మాట్లాడడం స్టార్ట్ చేశా కాంగ్రెస్ సభ్యులు నా ప్రసంగం వినిపించకుండా అరిశారు అన్నారు. మధ్యలో వాళ్ళ విప్ మాట్లాడడు అసలు అలా మధ్యలో విప్ కు సమయం ఇవ్వద్దు.. మధ్యలో ఇలా మాట్లాడడం సరైంది కాదు అని మా సీనియర్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్పీకర్ గారు సభ సంప్రదాయం కాదు అన్నారు.

నేను చాలా స్పష్టంగా మాట్లాడను,సభ సంప్రదాయలు పాటిస్తూ మాట్లాడను… స్పీకర్ ఎన్నికైన తరువాత పార్టీ గురించి మాట్లాడవద్దు అన్నారు. అభ్యంతరమైన పదాలు ఉంటే సభలో చర్చించి అభ్యంతరకరమైన పదాలు ఉంటే తొలగిస్తారు… లేదు అంటే స్పీకర్ కార్యాలయంకు పిలిచి ప్లోర్ లీడర్లను పిలిచి మాట్లాడి సభకు క్షమాపణ చెప్పమని అడుగుతారు అన్నారు.

పార్టీలకు అతీతంగా ఎన్నికైన స్పీకర్ మా విప్ అని ఎలా అంటాడు.. స్పీకర్ 15 నిమిషాలు సభ వాయిదా అని 4 గంటలు ఏం చేశారు అన్నారు. అంటే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి వీరికి అందుబాటులోకి రాక ఎం చేయాలో తెలియక 4 గంటలు వేట్ చేశారు.. అక్కడ ముఖ్యమంత్రి ఒకే అంటే ఊరు యాక్షన్ చేశారు అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ఎవరు ముందు మాట్లాడితే వారిని సస్పెండ్ చేయాలని ముందే ప్రణాళిక సిద్ధం చేశారు… అందులో భాగంగానే ముఖ్యమంత్రి చెప్పే వరకు ఆగారు అన్నారు.

నేను చాలా హుందాగా సభ సంప్రదాయాలను పాటిస్తూ మాట్లాడను కానీ వారు ముందే అనుకున్న విషయం కనుక నన్ను అక్రమంగా సస్పెన్షన్ చేశారు… సస్పెన్షన్ చేసినంత మాత్రాన ప్రజల సమస్యలపై ప్రభుత్వం ను నిలదీయడం అవుతాదా చెప్పాలన్నారు. బరాబరు ప్రజల కోసమే పని చేస్తాం గత 15 రోజులుగా రైతులు పడుతున్న బాధలు చూసి నన్ను వారి కోసం సభలో మాట్లాడమని కోరారు… మా అధినేత ఆదేశాల మేరకు భవిష్యత్ లో ముందుకు పోతా అన్నారు. మా జిల్లా కాంగ్రెస్ నాయకులు చిన్న వారు వారి గురించి మాట్లాడం వేస్ట్… రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు అన్నారు. కాంగ్రెస్ నాయకులను తిడుతున్న మాటలు చుస్తే అర్థం అవుతుందన్నారు.

Also Read:హరీష్ రావుకు హైడ్రా బాధితుల హోలీ విషెస్

- Advertisement -