- Advertisement -
కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి,పరిస్థితిలు అడిగి తెలుసుకున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అనంతరం పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం వితరణ చేసిన బియ్యం,నిత్యవసరాలను మంత్రి ప్రజలకు పంపిణీ చేశారు.దీనితో పాటు రంజాన్ సందర్భంగా జిల్లాలోని మజీద్ ఇమామ్‌లకు తన డబ్బులతో బియ్యం, నిత్యవసరాలను, దుస్తులును మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు.
రెడ్ జోన్‌లను అన్నీటింటిని ఎత్తివేసిన తర్వాత సూర్యాపేట పట్టణంలో ఎలాంటి పరిస్థితిలు ఉన్నాయో మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఎప్పటి లాగానే ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.
- Advertisement -