రేవంత్ భూస్కాంకు హద్దు లేదు:జగదీష్

6
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. బాలానగర్ పారిశ్రామిక వాడలకు సంబంధించిన ప్రభుత్వ భూములను తక్కువ ధరకే అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది పెద్ద స్కాంకు సంకేతమని ఆరోపించారు.

బాలానగర్ ప్రాంతంలో గజం భూమికి మార్కెట్ ధర సుమారు రూ.1.50 లక్షల వరకు ఉండగా, అధికారిక రిజిస్ట్రేషన్ విలువ కేవలం రూ.10 వేలుగా నిర్ణయించబడింది అన్నారు. ప్రభుత్వం ఆ విలువలో 30 శాతం అంటే సుమారు రూ.3 వేల రూపాయలు చెల్లిస్తే భూమిని అప్పగిస్తామని చెబుతోందని ఆయన ఆరోపించారు.

ఈ వ్యవస్థను ఉపయోగించి ముందుగా ప్రభుత్వ ఖజానాకు చిన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించి, తర్వాత భారీగా నగదు లావాదేవీలు జరుగేలా చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారని, దీనివల్ల ప్రతి గజానికి సుమారు రూ.3 కోట్ల మేర లాభం పొందే అవకాశాన్ని సృష్టించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విమర్శించారు.

అంటే ముందు నుండి ప్రభుత్వానికి కొద్దిగా ఇచ్చి, వెనక నుండి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడు అని దుయ్యబట్టారు.

Also Read:యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం..మోదీ హర్షం

- Advertisement -