- Advertisement -
తెలంగాణ నీళ్ళు ఆంధ్రాకు..తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు అని మండిపడ్డారు.
చంద్రబాబు ద్వారా మోడీ మెప్పు పొందడానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు అని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నాగార్జున సాగర్ జోలికి వస్తే తన్ని తరిమేశాడు…రేవంత్ అసమర్థత వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి వెళ్ళింది అన్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్‌ను పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నాయి ఆంధ్ర సీఆర్‌పీఎఫ్ బలగాలు. నాగార్జునసాగర్ డ్యామ్ 13వ గేట్ వద్ద విధుల నుండి వైదొలగాయి తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు.
Also Read:పెరుగుతున్న ఎండల తీవ్రత..
- Advertisement -

