కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు అని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? చెప్పాలన్నారు.
కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అన్నారు. బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి కేసీఆర్ సభను ఆగం చేద్దాం అని కుట్ర చేస్తున్నారు కానీ వాళ్ల కుట్రలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు అన్నారు.
గుజరాత్, బీహార్లో కట్టడం పూర్తి అవ్వకముందే కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎందుకు ఇవ్వదు ? చెప్పాలన్నారు. టీఆర్ఎస్కా.. బీఆర్ఎస్కా సభ అనేది మీకు ఎందుకు.. కేసీఆర్ సభ కోసం ప్రజలు వస్తున్నారు అన్నారు. బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు ప్రజలు కదులుతున్నారు .. దాన్ని కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి.
Also Read:కేసీఆర్..తెలంగాణ జాతిపిత సాంగ్

