బూతుల రాజకీయాలు…ప్రజలు బుద్దిచెప్తారు!

7
- Advertisement -

నీ బూతుల రాజకీయానికి ప్రజలే సమాధానం ఇచ్చారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. నీ ఎదురుగానే ఉన్న సర్పంచులే నీ మాటలకు విసిగిపోయి తిట్టుకున్నారని, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా మాట్లాడితే ఇలానే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా సావు కోరుకుంటారా అంటూ నిన్నే నిన్ను విమర్శించుకున్నారని చెప్పారు. నీ మాటలే నీ స్థాయిని బయటపెడుతున్నాయని, బాధ్యత లేకుండా మాట్లాడటం తగదని హెచ్చరించారు.

గత రెండేళ్లలో కేసీఆర్ నీ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించిన జగదీశ్ రెడ్డి, అలాంటప్పుడు నువ్వు ఎందుకు అంతగా బూతులు మాట్లాడుతున్నావని నిలదీశారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉంటాయని, అవి దాటితే ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలు చేసి రాజకీయ లాభం పొందాలని చూస్తే అది సాధ్యం కాదన్నారు.

ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పకుండా పోరాడతామని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. “ప్రభుత్వం తోలు వలుస్తాం” అన్న మాటను రాజకీయ పోరాటానికి రూపకంగా పేర్కొంటూ, అసభ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తానని చెబుతుంటే నువ్వు ఎందుకు వణుకుతున్నావని ప్రశ్నించారు. ప్రజల తీర్పే తుది తీర్పని, రాజకీయాల్లో సంస్కారం, హుందాతనం ఉండాలని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నువ్వు రండవు, నువ్వు కో** అని మేము కూడా అనొచ్చు కానీ మేము అనడం లేదు ..రేవంత్ రెడ్డి నువ్వు గల్లీ స్థాయి నాయకుడివి అని మల్లొకసారి నిరూపించుకున్నావు అన్నారు. వాడు ఎంత గొట్టం గాడు, కేసీఆర్ కాలి గోటికి సరోపోడు అని మేము అనొచ్చు.. కానీ మేము అనడం లేదు ..మీకు అది ఒక్క భాషనే వచ్చు కావొచ్చు మాకు అన్ని భాషలు వచ్చు …ఇతరుల చావు కోరుకోవడం అనేది రండ గాళ్లు చేసే పని అని మండిపడ్డారు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదని గుర్తు పెట్టుకో … ఒక్కటి మాత్రం వాస్తవం సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు నిన్ను మాత్రం ప్రజలే బండ రాళ్లు కట్టి మూసీలో వేస్తారు అన్నారు.

Also read:ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

 

- Advertisement -