పనసపండు తింటే మంచిదే.. కానీ!

22
- Advertisement -

పనస పండు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఇది పండ్లలోనే పెద్ద ఆకారం కలిగిన పండుగా చెబుతుంటారు. దీనిని ఇంగ్లీష్ లో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఉష్ణమండల వాతావరణంలో పనస చెట్లు బాగా పెరుగుతాయి. చైనా, హాంకాంగ్ వంటి దేశాల్లో పనస పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు, మనదేశంలో కూడా వీటిని ఇష్టంగా తినే వారి సంఖ్య ఎక్కువే. పనస పండ్లలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ సమపాళ్ళలో లభిస్తాయి. పనస పండు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటిలోని మ్యూకస్ పొరను కాపాడుతుంది.

చర్మ సంరక్షణకు కూడా ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో పనసపండులోని పోషకాలు ఉపయోగపడతాయి. అందువల్ల ఈ పండు తింటే వేసవిలో డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. పనసలో విటమిన్ సి కూడా లభిస్తుంది, తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇందులో ఉండే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటివి జీర్ణ వృద్దిని పెంచడంతో పాటు తక్షణ శక్తిని ఇవ్వడంలో కూడా సహాయ పడతాయి. ఇంకా పనసపండులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనత ఉన్నవారు పనస తినడం ఎంతో మంచిది.

ఇంకా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా పనస పండు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పనస పండు వల్ల లాభాలు ఉన్నప్పటికి వీటిని అధికంగా తినడం దుష్ప్రభావాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పనసపండుకు ఉండే జిగట కారణంగా చాలమందిలో అలెర్జీకి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా పురుషుల్లో ఈ పండు లైంగిక శక్తి ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలు గర్భధారణ సమయంలో కూడా ఈ పండును ఏమాత్రం తినకూడదట. ఎందుకంటే ఈ పండు చనుబాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఏపీ ప్రజల మనోగతం ఇదే!

- Advertisement -