పనసపండు…ఆరోగ్య ప్రయోజనాలు..!

50
- Advertisement -

సీజన్ ను బట్టి లభించే పండ్లలో పనస పండ్లు కూడా ఒకటి. వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు ఎంతో రుచికరంగా ఉండడం వల్ల చాలమంది ఇష్టంగా తింటూ ఉంటారు. పనస పండు ఎలాంటి రసాయనాలు, మందులు అవసరం లేకుండా పండుతాయి. కాబట్టి వీటిలో సహజ సిద్దంగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సి, బి6, మాత్రమే కాకుండా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

కాబట్టి ఆరోగ్య పరంగా పనస పండు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ప్లూ వంటి సమస్యలను ఎదుర్కోవడం పనస పండులోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇక ఎముకల దృఢత్వానికి కూడా పనస ఎంతో మేలు చేస్తుందట. ఇందులో ఉండే కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచి ఆర్థరైటిస్ ముప్పు ను దూరం చేస్తుంది. అయితే కేవలం పనస పండు మాత్రమే కాకుండా పనస గింజలలో కూడా పోషకాలు సమృద్దిగా ఉంటాయని పలు అధ్యయనలు చెబుతున్నాయి. పనస గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తం లోని సోడియం నిల్వలను నియంత్రిస్తుంది.

ఇక అధిక రక్తపీడనం, గుండె పోటు వచ్చే ముప్పు లను దూరం చేయడంలో కూడా పనస కీలక పాత్ర పోషిస్తుంది. కాగా పనస ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఎండిన పనస గింజలను మెత్తగా పొడి చేసుకొని, పలు తేనెలతో పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి రాసుకొని, 10 నుంచి 15 నిముషాల తరువాత చల్లటినీటితో కడిగేసుకుంటే మొఖం కాంతివంతంగా మారడంతో పాటు ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు కూడా దురమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:Harish:ప్రతిపక్ష నేతలే టార్గెట్ ఎందుకు?

- Advertisement -