బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో జబర్ధస్త్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో ప్రస్తుతం ఉన్న కామెడీ షో లలో జబర్దస్త్ కి హైయెస్ట్ రేటింగ్ ఉంది. అంతేకాదు ఈషోలో నటించిన కమెడీయన్లు చాలా మంది సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే మనకు ఎప్పుడు కామెడీ చేస్తు కనిపించే జబర్ధస్త్ నటుల రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
వారు ఎక్కడ చెప్పక పోయినా ఎదో ఒక రకంగా అయి లీక్ అవుతూనే ఉంటాయి. తాజాగా జబర్ధస్త్ లో వచ్చే జడ్జీల నుంచి కమెడీయన్ ల వరకు అందరి రెమ్యూనరేషన్ లకు సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబుకు నెలకు రూ. 16లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరో జడ్జ్ రోజాకు నెలకు రూ. 20లక్షలు ఇస్తున్నారట. అటు యాంకర్లగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మిలకు నెలకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇస్తారని సమాచారం.
అదేవిధంగా టీం లీడర్లలో ఎక్కువగా చమ్మక్ చంద్రకు నెలకు రూ. 4లక్షలు తీసుకోగా, ఆ తర్వాత సుడిగాలి సుధీర్ రూ.3.5 లక్షలు, అదిరే అభి రూ. 3 లక్షలు, రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, హైపర్ ఆది రూ. 3 లక్షలు అందుకుంటుండగా.. గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు చెరో 2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. ఇతర కామెడియన్లకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

