మొక్కలు నాటిన జబర్దస్త్ అప్పారావు..

32
green

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణకు హరితహారంను స్పూర్తిగా తీసుకొని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జూనియర్ కళాశాల ఆవరణలో జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు,జగదీశ్వరి,జూనియర్ ఆర్టిస్ట్ జితేందర్,కళాశాల అధ్యాపక బృందంతో కలిసి మొక్కలు నాటి వాటికి నీళ్ళు పోసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.