ఆకట్టుకుంటున్న ‘జాట్’ టీజర్

2
- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘జాట్’ కోసం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌తో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచింది.

టీజర్ రెండు పాత్రల మధ్య సాగే డైలాగ్ తో ప్రారంభమవుతుంది, వారిలో ఒకరు పోలీసు ఆఫీసర్. డైలాగ్ హీరో నటోరియస్ నేచర్, శత్రువులను భయపెట్టే విధ్వంస మార్గాన్ని తెలియజేస్తోంది. విలన్స్ చేతులు, కాళ్లను గొలుసులతో కట్టి ఉంచిన సన్నీ డియోల్ క్యారెక్టర్ ఇంటెన్స్ ఇంట్రడక్షన్ ని ప్రజెంట్ చేస్తోంది.

టీజర్‌లోని చాలా మూమెంట్స్ సన్నీ డియోల్ ఫిజిక్ ప్రజెన్స్, ఇంటెన్స్ క్యారెక్టర్ గురించి తెలియజేస్తున్నాయి. మ్యాసీవ్ ఫ్యాన్ ని ఉపయోగించి ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయింది. రణదీప్ హుడాను మెయిన్ విలన్ గా పరిచయం చేయడంతో టీజర్ థ్రిల్లింగ్ నోట్‌తో ముగిసింది.

రాపిడ్-ఫైర్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్‌తో టీజర్ రోలర్-కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ప్రతి సన్నివేశంతో ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ న ఉంచుతుంది. గ్లింప్స్ సూచించినట్లుగా, సన్నీ డియోల్, రణదీప్ హుడా మధ్య ఇంటెన్స్ పేస్ ఆఫ్ మెయిన్ హైలైట్‌లలో ఒకటి.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్-అప్పీలింగ్ యాక్షన్‌ని తీయడంలో తన స్కిల్ అద్భుతంగా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా వుంటాయి. S థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ ని ఎలివేట్ చేసింది. రిషి పంజాబీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని బ్రెత్ టేకింగ్ విజువల్ గా నిలిపింది. హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ఎక్స్ ఫ్లోజివ్ యాక్షన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో టీజర్ మాస్ ఫీస్ట్‌ను అందిస్తుంది.

Also Read:సంధ్య థియేటర్‌ ఘటనపై బన్నీ

ఈ చిత్రంలోవినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్‌ను పర్యవేక్షించగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ 2025 వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

- Advertisement -