జాను…టీజర్ డేట్ ఫిక్స్‌

612
jaanu
- Advertisement -

తమిళ్ లో భారీ విజయం సాధించిన 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగులో సమంత, శర్వానంద్‌లు హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తమిళ్‌లో 96ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి జాను అనే టైటిల్‌ని ఖరారు చేయగా ఇటివలే ఈమూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా తాజాగా ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు టీజర్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకోగా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -