పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మి నారాయణ..

228
J D Lakshmi Narayana Speaks about political entry
- Advertisement -

జేడీ లక్ష్మీనారాయణ….ఇతనొక పవర్ ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా అందరికి సుపరిచితులు. ఈ మధ్యే స్వచ్చంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపధ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని, జనసేన పార్టీలో చేరుతున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలపై తాజాగా స్సందించారు జేడీ లక్ష్మీనారాయణ. నా ఉపయోగం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతోందో బాగా ఆలోచించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందిస్తానని ఆయన తెలిపారు.

J D Lakshmi Narayana Speaks about political entry
శనివారం విశాఖలోని సీతమ్మధారలోని వినాయకుడిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాధాలు అందజేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీకీ స్పెషల్ స్టేటస్ వస్తే పరిశ్రమలు వస్తాయని తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మరీ ఇంతకు ఈయన రాజకీయాల్లోకి వస్తారా.? లేదంటే సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -