మొక్కలు నాటిన ఐవిఎఫ్‌టీ అధ్యక్షుడు శ్రీనివాస్..

486
Uppala Srinivas Gupta
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలా శ్రీనివాస్ గుప్తా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటడం జరిగింది. ఇందులో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున్న పాల్గొని మొక్కలు నాటారు.

green challenge

ఈ సందర్భంగా ఉప్పలా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. అశోక చక్రవర్తి లాగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 33 జిల్లాల్లో ఉన్న ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సభ్యులు చెట్లు నాటాలని వారికి ఈ ఛాలెంజ్‌ విసురుతున్నాను. 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భముగా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సభ్యులే కాకుండా,అన్ని సంఘాల వారూ మొక్కలు నాటాలి. అంతేకాదు దేశంలోని అన్ని రాష్ట్రాల ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్‌లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని శ్రీనివాస్ గుప్తా తెలిపారు.

IVF State president

- Advertisement -