హీరోయిన్ గా త్రిధా చౌధరీకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, ఆమెలో మ్యాటర్ ఉంది. ఆమె టాలెంటెడ్ అని ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో రుజువు అయ్యింది. అందంలోనే కాదు, అభినయంలోనూ త్రిధా చౌధరీలో ఎటువంటి వంక పెట్టలేం. పైగా బబ్లీ బ్యూటీ అంటూ ఆమెకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. దానికి తోడు ప్రస్తుతం సీనియర్ హీరోలందరికి త్రిధా చౌధరీ కరెక్ట్ జోడీ. అన్నిటికీ మించి నిర్మాతల హీరోయిన్. ఎక్కువ రెమ్యునరేషన్ అడగదు. ఎక్కువ డిమాండ్స్ చేయదు. ఇన్నీ మంచి లక్షణాలు ఉన్నప్పటికీ త్రిధా చౌధరీకి మాత్రం, సాలీడ్ అవకాశాలు మాత్రం రావడం లేదు. తేడా ఎక్కడ జరుగుతుందో ? తనకు అర్థం కావడం లేదని, ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ త్రిధా చౌధరీ చాలా బాధ పడింది.
తనను ఒకపక్క టాలెంటెడ్ హీరోయిన్ అంటూనే, మరోపక్క కేవలం సెకండ్ హీరోయున్ గానే చూస్తున్నారు అంటూ త్రిధా చౌధరీ విమర్శలు కూడా చేసింది. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు తనకు ఎందుకు ఇవ్వరు అంటూ కుమిలిపోయింది. అప్పుడు, త్రిధా చౌధరీ చేసిన కామెంట్స్ కారణంగా.. ఈ మధ్య త్రిధా చౌధరీ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. పూర్తిగా సైడ్ పాత్రల కోసమే ఆమెను అడుగుతున్నారట. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ పాత్రలు వచ్చేవి. ఇప్పుడు చిన్న హీరోల సినిమాల్లో కూడా త్రిధా చౌధరీకు సైడ్ పాత్రలే వస్తున్నాయి.
ఈ లెక్కన ఇక తాను సోలో హీరోయిన్ గా ఎప్పుడు సక్సెస్ లు అందుకోవాలి, అదే త్రిధా చౌధరీ ఆవేదన. ఎప్పటి నుంచో సోలో హీరోయిన్ గా నటించి ఫేమ్ తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంది. కానీ, ప్రస్తుతం ఆ వచ్చే అరకొర ఛాన్స్ లు కూడా రావడం లేదు. అందుకే, తన అవకాశాల పై త్రిధా చౌధరీ తాజాగా ఎమోషనల్ అయ్యింది. రాబోయే రోజుల్లో కూడా నాకు అవకాశాలు రాకపోతే, అడల్ట్ ఫిల్మ్స్ అయినా చేసుకుంటాను. సినిమా ఇండస్ట్రీ మాత్రం వదలను అంటూ త్రిధా చౌధరీ కామెంట్స్ చేసింది.
ఇవి కూడా చదవండి…