సుష్మాపై ఇవాంకా ప్రశంసలు…

170
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తే ఇవాంకా ట్రంప్‌ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సుష్మా స్వరాజ్ ను కలుసుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఇవాంక చెప్పుకొచ్చారు.

e1

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి సుష్మాస్వరాజ్ ,ఇవాంక ట్రంప్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుష్మాను ఇవాంకా కలిశారు. వీరిరువురూ వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ తో పాటు ఇరు దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు.

 ivanka trump praises sushmaswaraj

భేటీ అనంతరం సుష్మాపై ఇవాంకా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. భారత దేశానికి చెందిన, ఛరిష్మా కలిగిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలుసుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు.

వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, త్వరలో జరగనున్న జీఈఎస్2017, అమెరికా, భారత్ లలో వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ గురించి తమ మధ్య గొప్ప చర్చ జరిగిందని ఆమె తెలిపారు.

- Advertisement -