రానున్న రోజుల్లో భారతదేశాన్ని మరోసారి సందర్శించడానికి ప్రయత్నిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంక తెలిపింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి ఫిదా అయింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఇవాంక ధన్యవాదాలు తెలిపింది.
సీఎం ఆతిథ్యం మహోన్నతంగా, సరికొత్త స్ఫూర్తినిచ్చేలా ఉందని తెలిపింది. మీ సహృదయత, సృజనశీలత, తెలంగాణ ప్రజల ఆత్మీయత.. నన్నెంతగానో కదిలించాయి తన లేఖలో పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం అందజేసిన బహుమతి అత్యంత శ్రేష్ఠమైనదని.. ఎంతో అద్భుతమైన బహుమతిని అందజేశారంటూ ముఖ్యమంత్రికి ఇవాంకా కృతజ్ఞతలు తెలిపారు.
సదస్సు విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు.జీఈ సదస్సువల్ల హైదరాబాద్ ప్రాముఖ్యతను ప్రపంచస్థాయి సంస్థలు గుర్తించాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావును ఫిబ్రవరిలో అమెరికాకు రావాలంటూ ఆహ్వానించిన విషయం తెల్సిందే.