తల్లయింది సరే, మరి పెళ్లెప్పుడు ?

37
- Advertisement -

గోవా ముదురు భామ ఇలియానా అంటే.. ఇప్పటికీ యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇరవై సంవత్సరాలకు పైగా తన అందచందాలతో ఇలియానా కనువిందు చేస్తూనే ఉంది. అయితే, తానూ ప్రెగ్నెంట్ అంటూ ఈ గోవా బ్యూటీ ఇన్స్టా లో ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెంట్ స్టేటస్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ రెచ్చిపోతూనే ఉంది. తాజాగా ఫుల్ బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో బేబీ బంప్ తో కనిపించిన ఇలియానా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. పైగా ఇలియానా బేబీ బంప్ ఫొటోలపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.

తమన్నా, అథియా శెట్టి, నర్గీస్ ఫక్రి వంటి చాలామంది సెలబ్రిటీలు ఇలియానా బేబీ బంప్ ఫొటోల స్పందిస్తూ విషెస్ తెలియజేశారు. మొత్తానికి తన గర్భానికి కారకుడు ఎవరో చెప్పకుండానే.. ఇలియానా తన బేబీ బంప్ ఫొటోలను స్వేచ్ఛగా ప్రేక్షక లోకానికి పరిచయం చేస్తోంది. అసలు ఇలియానా కడుపుకి కారణం ఎవరై ఉంటారు అంటూ మరోవైపు నెటిజన్లు తెగ చర్చలు పెడుతున్నారు. అయితే, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో ఇలియానా లవ్‌ ట్రాక్‌ నడుపుతుంది. సెబాస్టియన్‌ తో కలిసి ఇలియానా మాల్దీవులకు కూడా వెళ్లింది. ఓ పార్టీలో ఇలియానాకి, సెబాస్టియన్‌ తో పరిచయం ఏర్పడింది.

Also Read: ‘ఎన్టీఆర్ 30’ కోసం ప్రత్యేక సెట్

అప్పటి నుంచి ఇలియానా – సెబాస్టియన్‌ ల మధ్య ఎఫైర్ నడుస్తోంది అని, పైగా గత ఏడాది నుంచి ఈ ఇద్దరు ఫుల్ డేటింగ్‌ చేస్తున్నారని.. ఇద్దరూ ఓకే ప్లాట్ లో ఉంటున్నారని కూడా టాక్ నడుస్తోంది. మొత్తానికి ఇలియానా మాజీ లవర్ ఆండ్రూ నీబోన్‌ స్థానాన్ని సెబాస్టియన్‌ బాగా కవర్ చేసినట్టు ఉన్నాడు. ఆ ఫలితంగానే ఇలియానా నెల తప్పిందట. మరి తల్లి అయ్యాక అయినా సెబాస్టియన్‌ ను ఇలియానా పెళ్లి చేసుకుంటుందో ? లేదో ? చూడాలి.

Also Read: పిక్ టాక్ : సొగసుల గుమగుమలండోయ్

- Advertisement -