బెంగాల్‌లో హింసతో గెలవాలని మమతా బెనర్జీ చూస్తున్నారని మండిపడ్డారు బీజేపీ చీఫ్ అమిత్ షా. అమిత్ షా ర్యాలీ నేపథ్యంలో మంగళవారం బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన షా…విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా మాకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందన్నారు.
హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు మద్దతిచ్చే అవకాశం లేదన్నారు. బెంగాల్‌లో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు. గుండాలను ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయాల్సి ఉండగా వారిని విడిచిపెట్టారని చెప్పారు.బెంగాల్ లో బీజేపీ 23 సీట్లు గెలుస్తుందని
నిన్నటి ర్యాలీలో సిఆర్పిఎఫ్ లేకుంటే తనకు రక్షణ ఉండేది కాదన్నారు. మమతా పాలనకు మే 23న ప్రజలు చరమగీతం పాడుతున్నారని జోస్యం చెప్పారు.
బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీనే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు.