- Advertisement -
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఈ లోగోకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
తాజాగా హీరో నాగార్జున స్నేహితుల దినోత్సవం సందర్భంగా అభిమానులకు మరో శుభవార్తనందించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సమయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు దేవదాస్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. యంతి బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలను సమకూర్చుతున్నారు.
- Advertisement -