అక్కడ బీజేపీదే హవా..!

474
bjp
- Advertisement -

హర్యానా,మహారాష్ట్రల శాసనసభ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తున్నాయి. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరంగా భంగపడనుంది.

bjp-congress

ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇలా ఉంది…

-రిపబ్లిక్ (మహారాష్ట్ర).. బీజేపీకి 135 నుంచి 142 స్థానాలు, శివసేనకు 81నుంచి 88 స్థానాలు, కాంగ్రెస్ కు 20 నుంచి 24 స్థానాలు, ఎన్సీపీకి 30 నుంచి 35 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు.
-రిపబ్లిక్ (హర్యానా).. బీజేపీకి 52 నుంచి 63 స్థానాలు, కాంగ్రెస్ కు 15 నుంచి 19 స్థానాలు, జేజేపీ కి 5 నుంచి 9 స్థానాలు, ఐఎన్ఎల్ డీ 0 నుంచి 1 స్థానం, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు.
-న్యూస్ ఎక్స్ (హర్యానా).. బీజేపీకి 75 నుంచి 80 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు.
-సీఎన్ఎన్ న్యూస్ 18 (మహారాష్ట్ర).. బీజేపీకి 243 స్థానాలు, కాంగ్రెస్ కు 41 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు.
-ఏబీపీ న్యూస్ సి.ఓటర్ (మహారాష్ట్ర).. బీజేపీకి 204 స్థానాలు, కాంగ్రెస్ కు 69 స్థానాలు, ఇతరులకు 15 స్థానాలు.
-న్యూస్ 24 (మహారాష్ట్ర).. బీజేపీకి 230 స్థానాలు, కాంగ్రెస్ కు 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు.
-టైమ్స్ నౌ (మహారాష్ట్ర).. బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు.
-టైమ్స్ నౌ (హర్యానా).. బీజేపీకి 71 స్థానాలు, కాంగ్రెస్ కు 11 స్థానాలు.
-ఇండియా టుడే (మహారాష్ట్ర) .. బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు, శివసేనకు 57 నుంచి 70, కాంగ్రెస్ కు 32 నుంచి 40, ఎన్సీపీ 40 నుంచి 50, ఇతరులకు 22 నుంచి 30 స్థానాలు.

- Advertisement -