దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గుజరాత్ శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం ముగిసింది. గుజరాత్ ఎన్నికలను ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీఎస్టీ అమలు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అత్యంత ప్రాధాన్యమేర్పడింది. 22 ఏళ్లుగా గుజరాత్ భాజపా పాలనలో ఉండటంతో ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ… మోదీ చరిష్మా, అభివృద్ధి ప్రచారస్త్రంగా పోరాడిన భాజపా ఓటర్లను తమవైపు తిప్పుకోగలిందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక దశలో, గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వివిధ సంస్థలు ప్రకటించాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం భాజపాదేనన్న విషయం స్పష్టమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 18న జరగనుంది.
గుజరాత్ మొత్తం స్థానాలు- 182
* సీఎన్‌ఎన్- ఐబీఎన్ : భాజపా 109, కాంగ్రెస్ 70, ఇతరులు 3
* టైమ్స్ నౌ-వీఎంఆర్ : భాజపా 109, కాంగ్రెస్ 70, ఇతరులు 3
* ఏబీపీ- సీఎస్‌డీఎస్: భాజపా 117, కాంగ్రెస్ 64, ఇతరులు 1
* రిపబ్లిక్ -సీ వోటర్: భాజపా 108, కాంగ్రెస్ 74, ఇతరులు 0
* రిపబ్లిక్- జన్‌కీ బాత్: భాజపా 108, కాంగ్రెస్ కూటమి 74
* జీ న్యూస్- యాక్సిస్ : భాజపా 99-113, కాంగ్రెస్ 68-82, ఇతరులు 1
* న్యూస్ 18- సీ ఓటర్: భాజపా 108, కాంగ్రెస్ 74, ఇతరులు 0
* న్యూస్ నేషన్: భాజపా 124- 128, కాంగ్రెస్ 52-56, ఇతరులు 1-3
* ఇండియా న్యూస్: భాజపా 110- 120, కాంగ్రెస్ 65-70, ఇతరులు 0-4
* సహారా సమయ్: భాజపా : 110-120, కాంగ్రెస్ 65-70, ఇతరులు 0
* యాక్సిస్: భాజపా 107, కాంగ్రెస్ 74, ఇతరులు 1
హిమాచల్‌ప్రదేశ్ మొత్తం స్థానాలు-68
* ఇండియాటుడే: భాజపా 47-55, కాంగ్రెస్ 13-20, ఇతరులు 2
* టైమ్స్ నౌ: భాజపా 51, కాంగ్రెస్ 16, ఇతరులు 1
* ఏబీపీ- సీఎస్‌డీఎస్: భాజపా 32-38, కాంగ్రెస్ 16-22
* వీడీపీఏ: భాజపా 56, కాంగ్రెస్ 10, ఇతరులు 2
* సమయ్ సీఎన్‌ఎక్స్: భాజపా 42-50, కాంగ్రెస్ 18-24, ఇతరులు 0-2
* జీ న్యూస్ – యాక్సిస్ : భాజపా 51, కాంగ్రెస్ 17, ఇతరులు0