ఎఫ్3 షూటింగ్ పూర్తి.. ఇక నవ్వుల జర్నీ షురూ..!

105
- Advertisement -

విక్టరీ వెంకటేష్‌, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోలుగా చిత్రం ఎఫ్3 తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో వెంకీ, వరుణ్ ల సరసన తమన్నా, మెహ్రీన్ కథానాయికలు. ఈసారి వెంకీ, వరుణ్ లతోపాటు సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎఫ్2 తరహాలోనే ఎఫ్3 కూడా నవ్వుల పండుగేనని చిత్రబృందం హామీ ఇస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ మూవీ విడుదల కానుంది.

- Advertisement -