ఘనంగా “ఇట్లు… మీ సినిమా” ట్రైలర్ లాంచ్‌

11
- Advertisement -

లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఇట్లు… మీ సినిమా” ఈనెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత నాగబాల సురేష్ మాట్లాడుతూ – రెండు దశాబ్దాలుగా పైగా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన బాలరాజు “ఇట్లు… మీ సినిమా” మూవీతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మారడం సంతోషంగా ఉంది. మంచి సినిమాకు చిన్నా పెద్దా తేడా లేదు. “ఇట్లు… మీ సినిమా” మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” కంటెంట్ చాలా బాగుంది. డైలాగ్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” దర్శకుడు హరీష్ చావా ప్రతిభావంతుడు. సినిమాను బాగా రూపొందించాడు. మేము ఏమాత్రం టైమ్ ఉన్నా చిన్న సినిమాకు సపోర్ట్ చేసేందుకు వస్తుంటాము. ఇవాళ ఈ సినిమాను బ్లెస్ చేసేందుకు ఇంతమంది శ్రేయాభిలాషులు ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత భారీ సంఖ్యలో వీక్షకులు హాజరైన ప్రెస్ మీట్ ఇదే అనుకుంటా. అన్నారు.

Also Read:CPI Narayana:ఈవీఎంలు బ్యాన్ చేయాలి

- Advertisement -