Revanth:మ‌ల్లేప‌ల్లిలో ఐటీఐ స్కిల్ ప్రాజెక్టు

11
- Advertisement -

హైదరాబాద్ మల్లేపల్లిలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టాటా టెక్నాలజీ ప్రతినిధులతో పాటు మంత్రి శ్రీధ‌ర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చాల‌ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఐటీఐల‌ను ఏటీసీలుగా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టీటీఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మిస్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు ఏటీసీలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అంద‌జేస్తాయని అధికారులు తెలిపారు.

Also Read:తిరుమలకు పోటెత్తిన భక్తులు..

- Advertisement -