కోలీవుడ్‌లో వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్న రష్మీకపై ఐటీ దాడులు జరుగగా ఇవాళ ఇళయ దళపతి విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయ్ ఇళ్లు,ఆఫీస్‌పై దాడులు జరుపుతున్నారు.
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో హీరో విజయ్ కి పలు ప్రశ్నలు సంధించారు. 20 గంటలుగా హీరో విజయ్ ని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ సోదాల నేపథ్యంలో విజయ్ ఇంటి దగ్గర భద్రత భారీగా పెంచారు.
విజయ్ తన నిర్మాణ సంస్ధ ఏజీఎస్‌తో కలిసి బిగిల్ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. చెన్నైలోని ఏజీఎస్ కార్యాయలంలో రూ.24 కోట్లు, మరో చోట రూ.50కోట్లకు పైగా అక్రమాస్తులను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ సోదాల నేపథ్యంలో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. విజయ్‌పై ఐటీ అధికారులు దాడులు చేయడంతో తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.