పెట్టుబడులకు కేటీఆర్‌ ఆహ్వానం….

196
it-minister-ktr-tour-to-japan
- Advertisement -

తెలంగాణకు పెట్టుబడుల సేకరణ కోసం జపాన్‌లో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అదివారం సాయంత్రం జపాన్‌లోని భారత రాయబారి సుజన్ చినాయ్‌ను కలిసారు. సూమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో జపాన్ దేశం నుంచి రాష్ట్రాలకు పెట్టుబడులు అకర్షించేందుకు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి కెటి రామారావు రాయభారి సూచనలు తీసుకున్నారు.

రాష్ర్టంలోకి భారీగా పెట్టుబడులను అకర్షించేందుకు చేపట్టిన పలు పాలసీ పరమైన చర్యలను మంత్రి వివరించారు. దీంతోపాలు పాలసీల అమలులో పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు, ఇందుకోసం రాష్ర్టం తీసుకుని వచ్చిన టియస్ ఐపాస్ విధానం గురించి వివరించారు. తెలంగాణ లాంటి నూతన రాష్ర్టం, వినూత్నమైన పాలసీలతో ముందుకు పోతున్న ప్రభుత్వం పెట్టుబడులు సాదించేందుకు జపాన్ కంపెనీలతో మరింత భాగసామ్యాన్ని పెంచుకునేందుకు తీసుకుకోవాల్సిన పలు చర్యలను రాయబారి సూచించారు.

జపాన్ లోని ఒక, రెండు నగరాలతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని చేసుకునేందుకు సహకరిస్తామని మంత్రికి సుజన్ చినాయ్ తెలిపారు. చిన్నతరహ పరిశ్రమలు, పెట్టుబడులపైన దృష్టి సారించాలని సూచించిన రాయబారి, అయా కంపెనీలకు కావాల్సిన సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకు సిబ్బంది సరఫరా చేసేందుకు ప్రత్యేకం సంస్ధను ఏర్పాటు చేయాలన్నారు. రాయబారి సూచనలను సానుకూలంగా తీసుకుని, తెలంగాణలో అమలు చేస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. మంత్రి కెటి రామారావు వెంట ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.

- Advertisement -