న‌గ‌ర ప్ర‌జల‌కు ఏవిధ‌మైన ఇబ్బందులు రాకూడదు : కేటీఆర్‌

285
- Advertisement -

హైదరాబాద్‌ లో కురిసిన భారీ వర్షాలు, సహాయక చర్యలపైన పురపాలక శాఖ మంత్రి కెటి రామరావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిహెచ్ ఎంసి, జలమండలి అధికారులు పాల్గొన్నారు.

నిన్నటి నుండి కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల న‌గ‌ర ప్ర‌జల‌కు ఏవిధ‌మైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్క్ లు చురుగ్గా సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

 It Minister Ktr Review Meeting With Ghmc Officials

ఇప్పటికే నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన 140 మ‌న్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో, కాలువ‌లు, నాలాల‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూం ద్వారా న‌గ‌రంలోని ప‌రిస్థితులను ఎప్పటిక‌ప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కూడా కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం సీసీ టీవిలు, డ‌య‌ల్ 100, జీహెచ్ఎంసీ కాల్‌సెంట‌ర్, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్న పిర్యాదుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు.

రాబోయే రెండు రోజుల పాటు మరిన్ని వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులంతా మరింత అలెర్టుగా ఉండాలని, విరిగిపడిన భారీ వృక్షాలను తొలగించి, వేంటనే విద్యుత్ సరఫరా చేయాలని ఇందుకోసం విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇక వివిధ శాఖల సమన్వయం కోసం ఈ రోజు ఉదయం జియచ్ యంసి, పోలీస్, వాటర్ వర్కస్, ట్రాఫిక్, విద్యుత్ శాఖాధికారులు సమావేశం అయ్యారు. ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌నరెడ్డి, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేంద‌ర్‌రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండి దాన‌కిషోర్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టర్ యోగితారాణాతో పాటు వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 It Minister Ktr Review Meeting With Ghmc Officials

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రికి జీహెచ్ఎంసీ కమీషనర్ వివరించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన వ్యక్తికి నాలుగు లక్షల విద్యుత్ శాఖ ద్వారా 4ల‌క్షల ఎక్స్‌గ్రేసియా, గోడ‌కూలి మ‌ర‌ణించిన ఇద్దరికి జీహెచ్ఎంసీ తరపున రెండు ల‌క్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రక‌టించినట్టు మంత్రి తెలిపారు. ఇక జలమండలి తరపున తీసుకున్న సహాయక చర్యలను మంత్రికి జల మండలి యండి దాన కిషోర్ వివరించారు.

ఇక రాబోయే 72 గంటల్లో ఏమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ కు అధనంగా ఈ సెల్ పనిచేస్తుంది. ఈ సెల్ కు కాల్ చేయాల్సిన నంబర్- 9989996948.

- Advertisement -