సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ నెం.1

253
- Advertisement -

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజ్ దక్కన్‌లో రాష్ట్ర బిల్డర్ల సమాఖ్య నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని.. రాష్ట్రం చీకటైపోతుందని గత పాలకులు దుష్పరాచారం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పాటు అనంతరం కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. ఇప్పుడు పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు భద్రత కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వాటర్ రింగ్ మెయిన్ వేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.

కృష్ణా, గోదావరి, ఏ ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా నగరానికి నీటి కొరత రావద్దనే ప్రయత్నంలో భాగంగా శామీర్‌పేట, రాచకొండ గుట్టల్లో 10 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. మంచినీటితో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించామని.. వ్యర్థాల నిర్వహణ కోసం డంప్ యార్డులతో పాటు గ్రీన్ క్యాంపింగ్ విధానాన్ని చేపట్టామని కేటీఆర్ వివరించారు.

- Advertisement -