ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పెత్తనం ఇక చెల్లదన్నారు మంత్రి కే.తారకరామారావు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు తప్ప, ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదని, కేంద్రం ఇచ్చిన నిధులు రూపాయి లెక్కతో సహా సీఎం కేసీఆర్ లెక్కలు చెప్పారని తెలిపారు కేటీఆర్.
కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్‌పై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మీడియా పలుకరించడంతో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్ కాదు ఫస్ట్ ఫ్రంటే అని స్పష్టం చేస్తూ పైవిధంగా స్పందించారు.
కాగా..బీజేపీ కూటమితో ఎవరూ లేరని, బలహీనపడ్డ అకాలీదళ్ తప్ప ఇంకా ఎవరూ ఆ కూటమిలో లేరన చెప్పారు. అందరూ కూటమినుంచి ఎందుకు బయటకుపోతున్నారో బీజేపీ ఆలోచించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన భవిష్యత్తులో మంచి పరిణామాలకు దారితీస్తుందని వెల్లడించారు కేటీఆర్.
దేశం అంటే కాంగ్రెస్ బీజేపీలు కాదని తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీ బలం ఉందని,కానీ..2019 లో ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్,బీజేపీలకు పూర్తి మెజారిటీ రాదని స్పష్టంచేశారు. కాగా..కేంద్రం పెత్తనాన్ని, ఫెడరల్ విధానాన్ని ప్రతిబింభించేలా ప్రత్యామ్నాయం అవసరమని చెప్పారు కేటీఆర్.