బుద్వేల్ లో ఐటి క్లస్టర్..:కేటీఆర్‌

194
IT Cluster in Budwel Hyderabad
- Advertisement -

హైదరాబాద్‌లో మరో ఐటి క్లస్టర్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తున్నట్లు ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. త్వరలో ఏర్పాటు కానున్న బుద్వేల్, రాజేంద్రనగర్ ఐటి క్లస్టర్ ప్రాంతాల్లో ఇవాళ పర్యటించిన కేటీఆర్ .. క్లస్టర్ ఏర్పాటు కోసం సేకరించనున్న పలు స్థలాలను  మంత్రి అధికారులతో కలిసి పర్యటించారు. బుద్వేల్ ఐటి క్లస్టర్కు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయునున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ క్లస్టర్ లో కంపెనీలను స్థాపించేందుకు ఇప్పటికే 30కిపైగా సంస్ధలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఇందులో ఐటి పరిశ్రమలో పేరున్న దేశీయ కంపెనీలతోపాటు అంతర్జాతీయ స్ధాయి మల్టీ నేషనల్ కంపెనీలున్నాయన్నారు. కంపెనీల విజ్జప్తి మేరకు వాటి వివరాలను ఇప్పుడే  పూర్తిగా చెప్పడం లేదన్నారు. త్వరలోనే అయా కంపెనీలతో లాంఛనంగా పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు.

 IT Cluster in Budwel Hyderabad

రాష్ట్ర ప్రభుత్వం ఐటి పరిశ్రమలను నగరంలోని నలు మూలలకు విస్తరించాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు పోతుందన్న మంత్రి, కొత్త క్లస్టర్ ద్వారా ఐటి పరిశ్రమ మరింత విస్తరిస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్లో అన్ని మౌళిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి, టియస్ ఐఐసి అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఇందుకు సంభందించి అత్యుత్తమ మాస్టర్ ప్లాన్ తయారు చేయాన్నారు. ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో ఎర్పడ్డాక సూమారు లక్షా పాతిక వేల ఉద్యోగాలు నూతనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాబోయే 5 ఏళ్లలోపే ఈ కంపెనీలు తమ పూర్తి స్ధాయి కార్యకలాపాలను ప్రారంభిస్తాయన్నారు.

ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోఉన్న పలు కార్యకలాపాలు లేని పలు ప్రభుత్వ సంస్ధలు తమ భూములను పరిశ్రమలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, వాటి భూ యాజమాన్య మార్పులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్లస్టర్ పనులను వేగవంతం చేసేందుకు ఐటి శాఖ, రెవెన్యూ శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఎస్‌ఐఐసీలతో కలిపి ఒక సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించనున్నారని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఐటి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ఐటి శాఖాధికారులు, రెవెన్యూ శాఖాధికారులు ఉన్నారు.

 IT Cluster in Budwel Hyderabad

- Advertisement -