నింగిలోకి కలాంశాట్…2019లో తొలి విజయం

214
pslv c44
- Advertisement -

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సైనిక అవసరాల కోసం తయారుచేసిన మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపింది ఇస్రో. మరోమారు శాస్త్రవేత్తల నమ్మకాన్ని నిలబెట్టిన పీఎస్‌ఎల్వీ సీ 44 ద్వారా కలాంశాట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహంగా కలాంశాట్ రికార్డు సృష్టించింది.

28 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం రాత్రి 11.37కు శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న మొదటి ల్యాంచ్‌పాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ 44 నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఓవరాల్‌గా పీఎస్‌ఎల్వీకి ఇది 46వ ప్రయోగం.2019లో చేసిన మొట్టమొదటి ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్‌తో పాటు శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లిన మైక్రోశాట్-ఆర్ బరువు 740 కిలోలు. ఇది ఇమేజింగ్ శాటిలైట్. దీంట్లో ఉండే శక్తిమంతమైన కెమెరాలతో ఫొటోలు తీస్తుంది. సైనిక అవసరాల కోసం దీనిని రూపొందించారు. కేవలం 10 సెంటీమీటర్ల సైజులో 1.2 కిలోల బరువు మాత్రమే ఉండే కలాంశాట్-వీ2ను చెన్నైలోని స్పేస్‌కిడ్జ్ ఇండియా అనే ప్రైవేటుసంస్థకు చెందిన విద్యార్థులు తయారుచేశారు. దీనికి అయిన వ్యయం రూ.12 లక్షలు. ఆరు రోజుల్లో దీనిని రూపొందించారు.

- Advertisement -