- Advertisement -
అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో ముందుడుగు వేసింది. రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన పుష్పక్ ప్రయోగం విజయవంతమైంది. దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ పుష్పక్ విమాన్ ను విజయవంతంగా పరీక్షించింది.
కర్ణాటకలోని రక్షణశాఖకు చెందిన చాలకెరె రన్‌వే నుంచి ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వేపై ల్యాండైంది.ఆర్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇస్రోకు ఇది మూడోది. 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువుండే పుష్పక్ ను ఆకాశంలో ఓ ఐఏఎఫ్ హెలికాప్టర్ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు.
Also Read:Ragi Ambali:అంబలితో ఆరోగ్యం
- Advertisement -