నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని (షార్‌లోని) రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం మధ్యా హ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు 20 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
43.43 మీటర్ల ఎత్తైన జీఎస్‌ఎల్వీ మాక్-3 రాకెట్.. ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత స్పేస్ క్రాఫ్ట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుందన్నారు. పైకెగసిన తర్వాత చంద్రయాన్-2కు 15 కీలక దశలను చేపట్టాలని, సెప్టెంబర్ మొదటి వారంలో ల్యాండర్ చంద్రుడిపై దిగే అవకాశం ఉంది.
ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లుంటాయి. దీని బరువు బరువు: 3.8 టన్నులు.ఈ ప్రయోగం కోసం రూ.978 కోట్లు ఖర్చవగా నీరు,హీలియం జాడలను ఇది గుర్తించనుంది. చంద్రుడు, భూమి మధ్య దూరం: 3.844 లక్షల కి.మీ. ఇంతకుముందెన్నడూ ఏ దేశమూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండర్‌ను మృదువుగా దింపనుంది ఇస్రో.
ఈ నెల 15వ తేదీ వేకువజామునే చంద్రయాన్-2ను ప్రయోగించాలని భావించినా, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
#WATCH: GSLVMkIII-M1 lifts-off from Sriharikota carrying #Chandrayaan2 #ISRO pic.twitter.com/X4ne8W0I3R
— ANI (@ANI) July 22, 2019