జీఎస్ఎల్వీ మార్క్- 3 రాకెట్ ప్రయోగం విజ‌య‌వంతం

240
gsat
- Advertisement -

ఇస్రో చేప‌ట్టిన మ‌రో ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని అంత‌రిక్ష ప్ర‌యోగం కేంద్ర నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. సాయంత్రం 5.08 నిమిషాల‌కు జీ శాట్ -29 ఆకాశంలోకి ప్రవేశ‌పెట్టారు. మొత్తం 3,423 కిలోల బరువున్న జీశాట్-29 ఉపగ్రహాన్నిమోసుకెళ్లింది. జియోసింక్రోన‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్బిట్‌లో జీశాట్ 29ను ఉంచ‌నున్నారు. ఎస్‌200 బూస్ట‌ర్ ద్వారా ప్ర‌యోగాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు.

srihari kota

ప్ర‌యోగం విజ‌యం సాధించ‌డంతో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌దేళ్ల పాటు జీశాట్ 29 ఇండియాకు సేవ‌లందించ‌నున్న‌ట్లు తెలిపారు శాస్త్ర‌వేత్త‌లు. జీశాట్ సిరీస్ లో రెండో ప్రయోగం విజయవంతమైందని, భారత్ నుంచి ప్రయోగించిన భారీ ఉపగ్రహం జీశాట్-29 అని పేర్కొన్నారు ఇస్రో చైర్మన్ కే శివన్. జీశాట్-29 ని వాహక నౌక 16 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని అన్నారు.

- Advertisement -