ఇస్రో మాజీ ఛీఫ్ యూఆర్ రావు మృతి

176
ISRO former chairman Prof UR Rao is dead
ISRO former chairman Prof UR Rao is dead
- Advertisement -

ప్రముఖ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ ఛీఫ్ ప్రొఫెసర్ యూఆర్ రావు (85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హృద్యోగ సమస్యల కారణంగా ఈ ఏడాది మొదట్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. రావు ప్రస్తుతం ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ పరిపాలనా విభాగ చైర్మన్‌గానూ, తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకు చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఉడిపిలోని అదంపూర్‌లో ఆయన జన్మించారు. ఈ జనవరిలో రావుకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. అయితే ఆ గౌరవాన్ని తాను మరణానంతరం అందుకుంటానని ఆయన చెప్పడం విశేషం.

1984-1994 మధ్య ఇస్రోకు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, పలు ఉన్నత పదవులు నిర్వహించారు. ఇస్రో చైర్మన్‌గా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. ఆర్యభట్ట నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు వరకు ఆయన పనిచేశారు కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో బోధకుడిగా పనిచేశారు. యూఆర్‌.రావు శాస్త్రవేత్తగా పది అంతర్జాతీయ అవార్డులను, మరెన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు.

- Advertisement -