భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది.ఏపీలోని నెల్లూరు శ్రీహరికోటలో స్పేస్ సెంటర్ షార్ నుండి ఇవాళ రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ – సీ 44 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ కొనసాగుతోంది.
బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైంది. 28 గంటల పాటు కొనసాగిన అనంతరం గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ-సీ44 నింగిలోకి దూసుకెళ్లనుంది.దేశ రక్షణ రంగం కోసం మైక్రోశాట్-ఆర్ (ఇమేజింగ్ శాటిలైట్) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరవేస్తున్నారు.
ఈ రాకెట్ ద్వారా తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన కలాం శాట్‌తో పాటు మైక్రోశాట్-ఆర్ రెండు చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపనున్నారు.పీఎస్‌ఎల్వీ- సీ44 ప్రయోగంలో బరువును తగ్గించి, పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగోదశలో అల్యూమినియం ట్యాంక్‌ను వినియోగిస్తున్నారు.