ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ హోస్సేన్ సలామీ, ఇద్దరు ఉన్నతాధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు హతం అయ్యారు.
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించారు. రాజధాని టెహ్రాన్‌లో ఉన్న అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. తెహ్రాన్ తూర్పు ప్రాంతంలోని పిరౌజీ వీధిలో ఉన్న ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం వద్ద మంటలు మరియు పొగలు కనిపించాయని స్టేట్ టీవీ తెలిపింది.
ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు. మేము మళ్లీ చర్చల పట్టిక వద్దకి రాగలమని ఆశిస్తున్నాం అని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ దాడులలో 50 మంది గాయపడగా ఇందులో మహిళలు మరియు చిన్నారులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, ఇరాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో ఎయిర్ ఇండియా అనేక ఫ్లైట్లను మళ్లించిందని లేదా వాటిని తిరిగి మొదటి గమ్యస్థానాలకు పంపినట్లు తెలిపింది.
Also Read:ఆలస్యం..ఆమె ప్రాణాలను కాపాడింది!

